- తెలియని మానసిక ఒత్తిడి:
అనేక ఫీచర్లను కలిగి ఉంటున్న స్మార్ట్‌ఫోన్‌లు మనిషిని తెలియన ఒత్తిడికి లోను చేస్తున్నాయి. ఉదాహరణకు.. ‘సోషల్ నెట్‌వర్కింగ్ సైట్స్' స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్న యువతలో అత్యధిక శాతం మంది సోషల్ నెట్‌వర్కింగ్‌లో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో నిద్రకు దూరమవుతున్నారు. ఆహారం వేళ కాని వేళల్లో తీసుకుంటున్నారు. పర్యావసానంగా అధిక ఒత్తిడిని అనుభవిస్తున్నారు.
- జ్ఞాపకశక్తి తగ్గుదల:
స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం జ్ఞాపకశక్తి పై ప్రభావం చూపుతోంది!. ఫోన్ నెంబర్‌లను మొదలుకుని వ్యక్తిగత విషయాల వరకు స్మార్ట్‌ఫోన్‌లలోనే స్టోర్ చేసుకుంటున్నాం. తద్వార మెదడుకు పనిలేకుండా పోతుంది. స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌ల వైపు చూడకుండా పది మంది మొబైల్ నెంబర్లు చెప్పగలిగితే గొప్పే.
- చిన్నారుల పై ఈ ప్రభావం ఎక్కువుగా ఉంటుంది:
స్మార్ట్‌ఫోన్‌లను చిన్నారులకు దూరంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నతనం నుంచే వారికి స్మార్ట్‌ఫోన్‌లను అలవాటు చేయటం ద్వారా ప్రాక్టికల్‌గా అవగాహన చేసుకోవల్సిన అంశాలను వారు ఆదమరుస్తారు.తద్వారా వారు మానసికంగా వెనుకబడిపోయే అవకాశముంది.
- మెదడు సోమరితనంగా మారే అవకాశం:
స్మార్ట్‌ఫోన్‌లు మానవ మేధస్సును సోమరిగా మార్చేసే అవకాశాం లేకపోలేదు. సార్ట్‌ఫోన్ అన్ని సౌకర్యాలను చేరువ చేసేస్తోంది. అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్ ద్వారా టన్నుల కొద్ది సమచారాన్ని ఏ మాత్రం శ్రమించుకుండా తెలుసుకోగలుగుతున్నాం. మనకు ఓ మెదడుందన్న విషయాన్ని ఆదమరుస్తున్న పలువురు తమకు తెలిసిన విషయాలను తెలుసుకునేందుకు సైతం సెర్చ్ ఇంజన్‌లను ఆశ్రయిస్తున్నారు.
0 comments:
Post a Comment